క్రియా యూనివర్సిటీలో లిబరల్ స్టడీస్... 1 m ago
విభిన్న సబ్జెక్టుల నుంచి నచ్చినవి ఎంచుకునే స్వేచ్చ లిబరల్ స్టడీస్ విధానంలో దక్కుతుంది. ఇది క్రియా యూనివర్సిటీలో అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో శ్రీసిటీ(తిరుపతి దగ్గర)లో నెలకొల్పారు. వివిధ రంగాల ప్రముఖులు గవర్నింగ్ కౌన్సిల్‌లో ఉన్నారు. కేంబ్రిడ్జ్, ఐఐటీ, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఐఐఎస్సీ నేపథ్యం ఉన్న ఫ్యాకల్టీ సభ్యులే ఎక్కువ. యూజీ కోర్సులకు సంవత్సారానికి 9 లక్షలకు పైగా ఫీజు చెల్లించాలి. తల్లి దండ్రుల వార్షికాదాయం తక్కువగా ఉండి, మెరిట్ ఉన్నట్లయితే అటువంటి విద్యార్ధులకు ఫీజు మినహాయిస్తారు. ఈ కోర్సులని రెసిడెన్షియల్ విధానంలోనే అందిస్తారు.